క్రికెట్ బెట్టింగ్స్ పై నిఘాపెట్టాలి : సీపీ అనురాధ

క్రికెట్ బెట్టింగ్స్ పై నిఘాపెట్టాలి : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: క్రికెట్ బెట్టింగ్స్ పై  ప్రత్యేకమైన నిఘాపెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని సీపీ అనురాధ సూచించారు. బుధవారం సీపీ ఆఫీస్ లో ఏసీపీ మధు, సీఐలతో కలసి లో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులను 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలన్నారు. 

స్థానిక ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజ్​ల్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కారుణ్య నియామకాల్లో భాగంగా 8 నెలల కింద అనారోగ్యంతో చనిపోయిన హెడ్ కానిస్టేబుల్  సయ్యద్ సలీముద్దీన్ కుమారుడు సయ్యద్ సోహెల్ పాషాకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, రామకృష్ణ, కిరణ్, శ్రీధర్ గౌడ్, ఏవో యాదమ్మ, సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ పాల్గొన్నారు.