క్రీడలు పోటీతత్వాన్ని పెంచుతయ్: సీవీ ఆనంద్

క్రీడలు పోటీతత్వాన్ని పెంచుతయ్: సీవీ ఆనంద్

క్రీడలతో మైండ్ ఫ్రెష్ గా ఉంటుందన్నారు బ్యాడ్మింటన్ ప్లేయర్  సైనా నెహ్వాల్. గోషామహల్  స్టేడియంలో జరిగిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కు సీపీ సీవీ ఆనంద్, సైనా నెహ్వాల్, కశ్యప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైనా నెహ్వాల్ ..తనకు  స్పోర్ట్స్ లో ఎలాంటి ఆటలైనా చాలా ఇష్టంమన్నారు.  భరత్ తరపున ఆడినప్పుడు చాలా గర్వాంగా అనిపిస్తుందన్నారు.  భరత్ దేశంలో చాలా  మంచి టాలెంట్ ఉన్న వాళ్లు ఉన్నారని చెప్పారు.  ప్రతి ఒక్కరు ఆటలు ఆడాలి... ఫిట్ గా ఉండాలన్నారు. తనను  ఈ స్పోర్ట్స్ మీట్ కి ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు.    

Also Read :- ఫ్రాడ్ జరిగిందా.. లంచం తీసుకుని స్టాక్ ప్రైస్ పెంచేశారా?

స్పోర్ట్స్ పోటీతత్వం పెంచుతుందన్నారు సీపీ సీవీ ఆనంద్.  ప్లేయర్లను చూసి యువత స్ఫూర్తి పొందాలన్నారు.  ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా స్పోర్ట్స్ మాన్ అయినా కాకపోయినా తప్పకుండా ఈ స్పోర్ట్స్ గేమ్స్  ఆడాలన్నారు.  ఇది మోటివేషన్ తో పాటు వాళ్లలోని నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. స్పోర్ట్స్ లో పాల్గొనడం టైం వేస్ట్ అనుకునే వాళ్ళు ఆ ఆలోచన నుంచి బయటికి రావాలని సూచించారు ఆనంద్.   గోషామహల్ లోని  శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలోఇది ఆఖరి స్పోర్ట్స్ మీట్... ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి కట్టబోతున్నారని చెప్పారు సీవీ ఆనంద్.