అనుమానాస్పద లావాదేవీలు గుర్తించాలి : సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అనుమానాస్పద లావాదేవీలు గుర్తించాలి : సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్ల బ్యాంక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్ సమయాల్లో ఆర్బీఐ ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల్లో కరెంట్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఆర్బీఐ రీజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమల్ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు, ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీలతో మంగళవారం హైలెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల్లో డబ్బు దోపిడీకి ఉన్న మూలాలను వివరించారు. 

మల్టిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్, షెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్ సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనుమానాస్పద లావాదేవీలను బ్యాంక్ మేనేజర్లు గుర్తించాలని తెలిపారు. ఇందుకోసం పటిష్టమైన ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల నుంచి బాధితుల డబ్బు కాపాడే అధికారులకు రివార్డులు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. ఆర్బీఐ రీజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమల్ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు సంప్రదించేందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాన్ని రూపొందించాలని  సూచించారు.