ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు హైదరాబాద్​ రాలేదు.. ఇక్కడే తిరుగుతున్నాడన్నది ఫేక్​న్యూస్​: సీపీ సీవీ ఆనంద్​

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు హైదరాబాద్​ రాలేదు.. ఇక్కడే తిరుగుతున్నాడన్నది ఫేక్​న్యూస్​: సీపీ సీవీ ఆనంద్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సంచలనం సృష్టించిన ఫోన్‌‌‌‌  ట్యాపింగ్‌‌‌‌  కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు గురించి ఎలాంటి సమాచారం లేదని సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ తెలిపారు. ఆయన హైదరాబాద్‌‌‌‌లో తిరుగుతున్నాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.ఈ కేసులో  ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావుపై లుకౌట్​ సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ ఉన్నదని వెల్లడించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఇమ్మిగ్రేషన్‌‌‌‌ అధికారులు అదుపులోకి తీసుకొని, తమకు సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావును రప్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.