అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసు విచారించిన సీవీ ఆనంద్

అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసు విచారించిన సీవీ ఆనంద్

 హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరించినా..ప్రజలను ఇబ్బంది పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. పోలీస్  కమాండ్ కంట్రోల్ రూంలో   హైదరాబాద్  సీపీ సీవీ ఆనంద్   జిల్లా అదనపు జిల్లా మెజిస్ట్రేటివ్( ఎగ్జిక్యూటివ్)  హోదాలో కార్యనిర్వాహక  కోర్టును నడిపారు.  ఈ నిర్వహణలో హుమాయున్  నగర్ పీఎస్ ఇన్ స్పెక్టర్ పెట్టిన పిటిషన్ ను విచారించారు. 

 హుమాయున్ నగర్  పోలీస్ స్టేషన్  పోలీసుల వివరాల ప్రకారం.  గాంధీనగర్ లోని సీసీ రోడ్డు ఘటన విషయంలో నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ కి కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్  మధ్య రాజకీయ వైర్యం ఉందని  తెలిపారు.  ఘటనలో భాగంగా  శాంతిభద్రతలను  భంగం కలిగించినందుకు  ఇరు వర్గాల పై కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం మజీద్ హుస్సేన్, ఫిరోజ్ ఖాన్ గ్రూపుల వాదనలు విన్నారు సీవీ ఆనంద్ .  వాదనలు విన్న  జిల్లా అదనపు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీవీ ఆనంద్ రెచ్చగొట్టే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం కేసు విచారణను  కేసు విచారణని వాయిదా వేశారు

ALSO READ | షీ టీమ్స్కు పదేళ్లు.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..