హైదరాబాద్: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంథ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన స్టేట్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. అనుమతి లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అనగా.. పోలీసుల పర్మిషన్‌తోనే థియేటర్‌కు వెళ్లానని.. తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం సినిమా చూసే సమయంలో తనకు తెలియదని అల్లు అర్జున్ వాదిస్తున్నాడు. ఈ క్రమంలో 2024, డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర అసలేం జరిగిందనే దానిపై హైదరాబాద్ పోలీసులు ఆదివారం (డిసెంబర్ 22) మినిట్ టూ మినిట్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ థియేటర్ యాజమాన్యం ఈ విషయం అల్లు అర్జున్‌కు చెప్పిందో లేదో తమకు తెలియదన్నారు సీపీ. ఈ ఘటనపై ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. ‘‘తొక్కిసలాట ఘటనను అల్లు అర్జున్‌కు చెప్పేందుకు ప్రయత్నించాం. మేనేజర్ సంతోష్ మమ్మల్ని అడ్డుకుని.. అల్లు అర్జున్‌కు విషయం నేనే చెబుతానని అడ్డుకున్నాడు.
ALSO READ | సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
పరిస్థితి చేయి దాటి పోవడంతో నేనే స్వయంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి తొక్కిసలాట గురించి చెప్పాను. ఓ మహిళ మృతి చెందింది.. ఒక బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని చెప్పి థియేటర్ నుండి వెళ్లిపోవాలని కోరాం. కానీ సినిమా మొత్తం చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ అన్నాడు. యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించడంతో ఆయన థియేటర్ నుండి వెళ్లిపోయాడు’’ అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తొక్కిసలాటలో మహిళా మృతి చెందదన్న విషయం పోలీసులు తనకు చెప్పలేదని బన్నీ అంటోన్న విషయం తెలిసిందే.