నీరజ్ పన్వార్ కుటుంబసభ్యులను కలిసిన సీవీ ఆనంద్

బేగంబజార్ లో హత్యకు గురైన నీరజ్ పన్వార్ కుటుంబసభ్యులను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కలిశారు. ఆ తర్వాత షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో యాదవసంఘం నేతలతో సమావేశమయ్యారు. బేగంబజార్ హత్య కేసులో ఇప్పటికే 9మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును త్వరతగతిన విచారించి బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. 

ఈ హత్య వల్ల రాజస్థాన్ నుంచి వచ్చి సెటిల్ అయిన మార్వాడీ వర్గం - లోకల్ గా ఉన్న యాదవ్ వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడిందని..ఈ రెండు వర్గాలతో తాను స్వయంగా మాట్లాడినట్లు సీపీ వెల్లడించారు. ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఇరువర్గాల వారికీ సూచించామన్నారు. కొంతమంది యువకుల వల్ల ఈ రెండు వర్గాల వారికి గొడవలు వచ్చాయన్నారు. 

ఈ ఏరియా లో అల్లర్లు చేయలనుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కొంతమంది పిల్లలు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని..వారిపై పేరెంట్స్ నిఘా పెట్టి అదుపు చేయాలని సూచించారు. ప్రేమ వివాహాలను పెద్దలు అర్థము చేసుకోవాలన్న సీపీ..ప్రస్తుతం మనం ఆధునిక సమాజంలో జీవిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ పేరెంట్స్ కు నచ్చకపోతే వారిని వదేలేయాలని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

ఐపీఎల్ ఫైనల్పై ఫిక్సింగ్ ఆరోపణలు

కిషన్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న ఆప్ నేతలు