అర్బన్‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌పై  దృష్టి పెట్టాలి  : సీపీ గౌస్‌‌‌‌ ఆలం

అర్బన్‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌పై  దృష్టి పెట్టాలి  : సీపీ గౌస్‌‌‌‌ ఆలం

కరీంనగర్ క్రైం,వెలుగు: అర్బన్‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌పై దృష్టిపెట్టాలని సీపీ గౌస్‌‌‌‌ ఆలం అధికారులను ఆదేశించారు. గురువారం  కమిషనరేట్ పరిధిలోని రూరల్ డివిజన్ ఏసీపీ ఆఫీస్‌‌‌‌ను సీపీ సందర్శించారు. పెండింగ్ కేసులపై రివ్యూ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. వాటికి గల కారణాలను తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నందున  ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణా, రేషన్​ బియ్యం, పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్‌‌‌‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.