సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్​పెట్టాలి :  సీపీ గౌస్​ఆలం

సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్​పెట్టాలి :  సీపీ గౌస్​ఆలం
  •     కమిషనరేట్​ పరిధిలో సీపీ పర్యటన  

కరీంనగర్ క్రైం,వెలుగు: కమిషనరేట్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని సీపీ గౌస్​ఆలం ఆదేశించారు. బుధవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో వన్, టూ, త్రీ టౌన్ పోలీసు స్టేషన్లలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు జరిగే పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

అనంతరం కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటి పనితీరును ఆర్టీసీ ఆధికారులను అడిగి  తెలుసుకున్నారు. ఆయన వెంట ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసీపీ  యాదగిరి స్వామి, వన్, త్రీ టౌన్ సీఐలు కోటేశ్వర్, జాన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్టీసీ  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం బి.రాజు, డిప్యూటీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం సుధాకర్ రెడ్డి  ఉన్నారు. 

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులపై సీపీ రివ్యూ 

చొప్పదండి, వెలుగు: కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం  తనిఖీ చేశారు. పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాల వివరాలు అడిగారు. పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించిన విధులను అడిగి తెలుసుకున్నారు.

సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. విజిబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని అన్ని గ్రామాలకు పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో చొప్పదండి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సీఐ, కరీంనగర్ రూరల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదీప్ ,  ఎస్సై అనూష పాల్గొన్నారు...