ఖమ్మం రూరల్, వెలుగు : రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన శాసన సభ మోడల్ కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు తుషార్ కాంత మహంతి, కలెక్టర్ వీపీ గౌతమ్ గురువారం పరిశీలించారు. సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు గమనించాలని, మరో సీసీటీవీని ఏర్పాటు చేయాలని చెప్పారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, ఏఈఈ విశ్వనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి ఉన్నారు.
ఇబ్బందులు లేకుండా చూడాలి
భద్రాచలం, వెలుగు : నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజే గడువు ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. భద్రాచలం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని, డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తున్నందున, చివరి రోజున రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓటు పై అవగాహన అవసరం
పాల్వంచ, వెలుగు : స్టూడెంట్స్కు ఓటు పై అవగాహన అవసరమని కలెక్టర్ ప్రియాంక అల చెప్పారు. విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించేందుకు స్కూల్లో నిర్వహించే మాక్ పోలింగ్ దోహద పడుతుందన్నారు. గురువారం పాల్వంచలోని బొల్లోరు గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నమూనా పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు.