గోదావరిఖని, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద 24 గంటలపాటు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేయాలని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ ఆఫీసర్లు, సిబ్బందికి సూచించారు. గురువారం గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి వద్ద చెక్ పోస్ట్, జైపూర్ పీఎస్ పరిధిలోని ఇందారం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు.
చెక్ పోస్ట్ వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు, బైక్‌లను కూడా చెక్ చేయాలన్నారు. సీపీ వెంట గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, తదితరులు ఉన్నారు. గోదావరిఖని పట్టణంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను సీపీ శ్రీనివాస్ సందర్శించారు.