సంతాప సభలో రాజకీయాలా?.. ఏలేటిపై కూనంనేని ఫైర్

సంతాప సభలో రాజకీయాలా?.. ఏలేటిపై కూనంనేని ఫైర్

పీవీ నరసింహరావును  కాంగ్రెస్ అవమానించిందన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు  అభ్యంతరం చెప్పారు. సభలో వ్యక్తిగత అంశాలపై మాట్లాడొద్దని  సూచించారు.  అసెంబ్లీలో మన్మోహన్ సంతాపం తీర్మానం సందర్భంగా మాట్లాడిన కూనంనేని.. సంతాప సభలో రాజకీయ  ప్రకటనలు సరికాదన్నారు.  మన్మోహన్ సింగ్ నిజాయితీని దేశమే శంకించలేదని అన్నారు.  రాజకీయ ప్రసంగాలతో మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందన్నారు కూనంనేని.  మన్మోహన్ నీతి, నిజాయితీ, నిబద్ధతకు  నిలువుటద్ధమని కొనియాడారు .

Also Read : శాసన సభలో గందరగోళం.. రికార్డుల నుండి ఏలేటి వ్యాఖ్యలు తొలగింపు

 ఆర్టీఐ, ఉపాధి, భూసేకరణ చట్టాల్లో కమ్యూనిస్టుల పాత్ర కూడా ఉందన్నారు కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టుల సలహాలతోనే అనేక చట్టాలు వచ్చాయన్నారు.  అణు ఒప్పందంతోనే కాంగ్రెస్  కమ్యూనిస్టు బంధానికి బ్రేక్ పడిందన్నారు. పీవీ కష్టాల్లో ఉన్నప్పుడు మన్మోహన్ అండగా ఉన్నారని చెప్పారు. సైలెంట్ గా పనిచేయడమే మన్మోహన్ స్టైల్ అని అన్నారు కూనంనేని సాంబశివరావు