- సిటీ సీపీ సీవీ ఆనంద్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: దేవాలయాలపై దాడుల నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో జైల్స్ డీజీ సౌమ్యా మిశ్రా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రమాదేవి, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఐజీపీ కమలాసన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సీపీ ఆనంద్మాట్లాడుతూ.. మానసిక స్థితి సరిగా లేనివారు మతపరమైన ప్రదేశాల్లో తిరగకుండా చూడాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోడ్లపై చెత్త ఏరుకునే వారితోపాటు నిరాశ్రయులను గుర్తించాలని సూచించారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిఘా పెట్టాలని ఆదేశించారు.