జన్నారం, వెలుగు: బీఆర్ఎస్ అధ్వర్యంలో ఈ నెల 17న జన్నారం మండల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభా స్థలాన్ని సీపీ రెమా రాజేశ్వరి, మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. మంత్రి కేటీఆర్పాల్గొననున్న ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలతో పాటు వెహికల్ పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు.
అనంతరం హెలీప్యాడ్‌ను పరిశీలించారు. సీపీ వెంట మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, లక్సెట్టిపేట సీఐ కృష్ణ, ఎస్ఐ సతీశ్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, జన్నారం ఎంపీటీసీ రియాజొద్దిన్, ఏఎంసీ డైరెక్టర్ వొల్లాల నర్సాగౌడ్, ధర్మారం మాజీ సర్పంచ్ ప్రణవ్ కుమార్ ఉన్నారు.