
నిజామాబాద్, వెలుగు : ఈ నెల 12 నగరంలో నిర్వహించే హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ మళ్లించనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. గురువారం హనుమాన్ ర్యాలీ ఆర్గనైజర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కంఠేశ్వర్ ఆలయం నుంచి షురువయ్యే ర్యాలీ జడ్పీ చౌరస్తా, హమాల్వాడీ, ప్రభాత్ టాకీస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, గోదామ్ రోడ్డు, దేవీ రోడ్డు, మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆజంరోడ్, పెద్ద బజార్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తాకు చేరుకుంటుందన్నారు.
ర్యాలీ కొనసాగే రోడ్ల పక్కన షాప్లు, ఇండ్లు ఉన్న వ్యక్తులు శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు వాహనాలు పార్కింగ్ చేయొద్దన్నారు. సిటీలోకి వెహికల్స్ ఎంటర్ కాకుండా మూడు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేయనున్నామని పేర్కొన్నారు.