గురుద్వార్​ను సందర్శించిన సీపీ : సాయిచైతన్య

గురుద్వార్​ను సందర్శించిన సీపీ  : సాయిచైతన్య

నిజామాబాద్, వెలుగు : ఇందూర్ నగరంలో సిక్కుల గురుద్వార్​ను ఆదివారం సీపీ సాయిచైతన్య సందర్శించారు.  కొత్త ఏడాదికి సిక్కులు నిర్వహించే బైసాఖి విశిష్టతను తెలుసుకున్నారు. నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సీపీ పాల్గొనగా,  గురుద్వార్​ కమిటీ లీడర్ దర్శన్​సింగ్​ సీపీకి  తల్వార్ బహూకరించారు. 

గర్ల్ స్టూడెంట్స్​కు సెల్ఫ్​ డిఫెన్స్​ శిక్షణ

వేసవి సెలవుల్లో 9, 10, ఇంటర్​ గర్ల్​ స్టూడెంట్స్​కు సెల్ఫె డిఫెన్స్​పై ఉచిత ట్రైనింగ్ ఇవ్వనున్నామని సీపీ సాయి చైతన్య ఆదివారం తెలిపారు.  ఆర్మూర్ రోడ్డులోని ఆర్ బీవీఆర్ స్కూల్​ గ్రౌండ్​లో ఈనెల 25 నుంచి మే 5 వరకు  శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తిగల బాలికలు ఈనెల 24లోగా 9000994312కు సంప్రదించాలన్నారు.