రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు:  సీపీ శ్వేత

రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు:  సీపీ శ్వేత

సిద్దిపేట రూరల్, వెలుగు: సోషల్​మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని సీపీ శ్వేత హెచ్చరించారు. సోమవారం సీపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డిపై దాడికి సంబంధించి ఇరు పార్టీల సభ్యులు రెచ్చగొట్టే విధంగా పోస్టులు, కామెంట్లు పెట్టవద్దన్నారు.  

సోషల్ మీడియాలో అసత్యాల్ని వ్యాప్తి చేసే వారి పై కేసులు నమోదు చేసి వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, లేదంటే కేసులు నమోదై భవిష్యత్​ పాడవుతుందని  సూచించారు.