పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ను ప్రారంబించారు సీపీ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేముందు, వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసేముందు జాగ్రత్తలు వహించాలని ఆయన చెప్పారు. 24/7 నిరంతరం సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. మత ఘర్షణలు కలిగేలాగా, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై, చట్టవిరుద్ధమైన పోస్టులు పెట్టేవారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.