ఖమ్మం టౌన్ లో ...డిజిటల్ క్లాసులను ప్రారంభించిన సీపీ

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ వెల్ఫేర్ స్కూల్ లో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ తో కలిసి ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను బుధవారం స్కూల్ చైర్ పర్సన్ హృదయ మేనాన్, సీపీ విష్ణు యస్.వారియర్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీని వాడుకుంటూ స్టూడెంట్స్ భవిష్యత్ ను తీర్చదిద్దడంలో డిజిటల్ క్లాసులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్స్ కు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు బైయాన బాబు, బి.రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, ఆర్ఐ కామ రాజు, ప్రిన్సిపల్ శ్రీనివాస రాజు పాల్గొన్నారు.