సీపీ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం

సీపీ  స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రంజిత్ బుధవారం కన్నుమూశారు. ఆయన మృతిపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలో తాను పనిచేశానని గుర్తు చేసుకున్నారు.  పోలీస్ శాఖకు రంజిత్ చేసిన సేవలు విలువైనవన్నారు. 

ఆయన మృతి పోలీస్ వర్గాలకు తీరని లోటు అని డీజీపీ విచారం వ్యక్తం చేశారు. రంజిత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పలువురు పోలీసు ఉన్నతాధి కారులు సైతం రంజిత్ మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు ఈ నెల 27న మధ్యాహ్నం నారాయణ
గూడలో జరగనున్నాయి.