భార్యను క్రూరంగా చంపాడు.. ఇలాంటి కేసు ఎప్పుడు చూడలే: సీపీ సుధీర్ బాబు

భార్యను క్రూరంగా చంపాడు.. ఇలాంటి కేసు ఎప్పుడు చూడలే: సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్‎లోని మీర్ పేట్లో భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మంగళవారం (జనవరి 28) మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ నెల 15, 16న భార్యాభర్తలు గురుమూర్తి, వెంకటమాధవి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గురుమూర్తి 16వ తేదీన భార్య తలను గట్టిగా గోడకేసి కొట్టి హత్య చేశాడు. అనంతరం  మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ హీటర్‎తో శరీర భాగాలను ఉడికించాడు.. ఆ ఉడికించిన బాడీ పార్ట్స్‎ను స్టవ్‎పై కాల్చాడు. కాల్చిన ముక్కలను మళ్లీ పొడిగా మార్చి చెరువులో పడిబోశాడు.

భార్యను హత్య చేయాలని గురుమూర్తి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. వ్యూహాం ప్రకారం అత్యంత క్రూరంగా గురుమూర్తి తన భార్యను హత్య చేశాడు. ఇంత క్రూరంగా చంపుతారా అని మేమే ఆశ్చర్యపోయాం.. ఇలాంటి కేసు ఇప్పటి వరకు చూడలేదన్నారు సీపీ. నిందితుడిలో భార్యను చంపినట్లు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. ఇంట్లో ఎలాంటి ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా గురుమూర్తి ప్లాన్ చేసుకున్నాడని తెలిపారు. 

ALSO READ | మీర్​పేట మర్డర్​ కేసులో కీలక అప్డేట్.. గ్యాస్‌ స్టౌపై రక్తపు మరకలు, మాంసం ముక్క

ఈ కేసుకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలు అన్ని సేకరించామని, గురుమూర్తి హత్యకు ఉపయోగించిన 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితుడు గురుమూర్తిపై బీఎన్ఎస్ 103(1), 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడు గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేశాడని చెప్పారు సీపీ. వెంకటమాధవి కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించారు.