గంజాయి రవాణా కట్టడికి చర్యలు : సీపీ సునీల్ దత్ 

గంజాయి రవాణా కట్టడికి చర్యలు : సీపీ సునీల్ దత్ 

ఖమ్మం టౌన్, వెలుగు : గంజాయి రవాణా కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాలు, గంజాయి సరఫరా, చట్ట వ్యతిరేక కార్యకాలాపాలు అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ గంజాయి కేసులపై పోలీసు యంత్రాంగంతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాలను తనిఖీ చేయడం ద్వారా గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయగలమన్నారు. సరఫరా మూలాలను కనిపెట్టి వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. డ్రగ్స్ వాడకం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి స్కూళ్లు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్, సీఐ స్వామి, రామకృష్ణ పాల్గొన్నారు.