కారేపల్లి, వెలుగు : మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను, కారేపల్లి పోలీస్ స్టేషన్ ను ఖమ్మం సీపీ సునీల్ దత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో మోహరించిన కేంద్ర పోలీసు బలగాలతో పాటు స్థానిక పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటించాలని ప్రజలకు సచించారు.