- ప్రారంభించిన రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
ఎల్బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధి నాగోల్‌లో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్‌ను మంగళవారం సీపీ డీఎస్ చౌహాన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నాగోల్ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని.. ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం భవనాన్ని ఇచ్చిన నాగోల్ నవచైతన్య యువజన సంఘం సభ్యులను సీపీ అభినందించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తొందరలోనే నాగోల్ పోలీస్ స్టేషన్‌కు మరో చోట కొత్త బిల్డింగ్‌ను నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.