హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహిస్తున్న సీపీగేట్ ఫైనల్ ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుందని సీపీగేట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, 3న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, డిసెంబర్ 5న సీట్లను కేటాయిస్తామని చెప్పారు. సీటు పొందిన విద్యార్థులు డిసెంబర్ 9న సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.