
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే సీపీగెట్ పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 10 వరకు పరీక్షలు జరుగుతాయని సీపీగెట్ కన్వీనర్ పాండురంగా రెడ్డి తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. మొత్తం 9 రోజుల పాటు పరీక్షలుంటాయని చెప్పారు. ప్రతిరోజూ మూడు విడతల్లో పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠి, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ఎగ్జామ్ లేదన్నారు. ఇప్పటివరకు సీపీగెట్కు 69,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.