
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వంట గ్యాస్ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ధరలు తగ్గించాలని డిమాండ్చేశారు. పాల్వంచ, వెలుగు: పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో సీపీఐ జిల్లా నాయకుడు బండి నాగేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి రాహుల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అశ్వారావుపేట, వెలుగు: సీపీఐ జిల్లా నాయకుడు సలీం ఆధ్వర్యంలో అశ్వారావుపేట పట్టణంలో నాయకులు ర్యాలీ నిర్వహించారు.
కారేపల్లి, వెలుగు: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో టేకులగూడెంలో నాయకులు ఆందోళన చేపట్టారు. గుమ్మడి సందీప్, తేలే రాకేశ్ తదితరులున్నారు.
జూలూరుపాడు, వెలుగు: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
కామేపల్లి, వెలుగు: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో కామేపల్లిలో నాయకులు నిరసన తెలిపారు. వసంతరావు, రహీమ్ పాల్గొన్నారు.