కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ ఆఫీస్‌లో సీపీఐ శత వార్షికోత్సవం నిర్వహించారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ టౌన్ సెక్రటరీ కామెర దుర్గరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమనాథుని సుదర్శనం, ఏఐటీయూసీ బ్రాంచి
సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. పేద ప్రజల హక్కులు, సంక్షేమం కోసం 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందన్నారు. దున్నేవారికే భూమి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి వేల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత పార్టీకి దక్కుతుందన్నారు.
ఎందరో కమ్యూనిస్టు యోధులు పార్టీ కోసం ప్రాణాలు త్యాగాలు చేశారని గుర్తుచేశారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సీపీఐ పార్టీదన్నారు. కార్యక్రమంలో పార్టీ, ట్రేడ్‌యూనియన్ లీడర్లు బండారి రాజేశం, ప్రేమ్‌లాల్, వెల్ది ప్రభాకర్, పెద్దపల్లి బాణయ్య, ఎండీ రూల్, అంటోని దినేశ్, జి.సుదర్శన్ రెడ్డి, బొల్ల పూర్తిమ, పద్మ, వజ్ర తదితరులు పాల్గొన్నారు.