సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ

హైదరాబాద్ లో  సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి  ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ పలువురు నేతలు హాజరయ్యారు.  నల్గొండ- -ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు మే 25 సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తోంది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీచేస్తున్నారు. మే 27న పోలింగ్ జరగనుంది.