
న్యూఢిల్లీ: అధిక ఆహార ధరల కారణంగా గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.49 శాతం నుంచి అక్టోబర్‌లో 6.21 శాతానికి పెరిగింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అప్పర్ టాలరెన్స్ లెవెల్ కంటే ఎక్కువ. అంతేగాక 14 నెలల గరిష్టానికి ఎగిసింది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్ 2023లో 4.87 శాతంగా ఉంది. సెప్టెంబరులో 9.24 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 10.87 శాతానికి పెరిగింది. అంతకు ముందు ఏడాది నెలలో 6.61 శాతానికి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో కీలకమైన స్వల్పకాలిక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం 2 శాతం మార్జిన్‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది.