సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
  • పొత్తు ధర్మం ప్రకారం సీపీఐకి ఒక సీటు ఇచ్చిన కాంగ్రెస్ 

హైదరాబాద్, వెలుగు:  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ తన అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మక్దూంభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ప్రకటించారు. సత్యం సోమవారం ఉదయం నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్నారు. అయితే, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి, నెల్లికంటి సత్యం మధ్య తీవ్ర పోటీ కొనసాగింది.

 ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పొత్తు ధర్మంలో భాగంగా మునుగోడులో పోటీ నుంచి వైదొలిగానని, ఇప్పుడు తనకే ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వాలని చాడ పట్టుబట్టినట్టు తెలిసింది. వీరిద్దరితోపాటు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్​రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు తక్కెళపల్లి శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్సీ సీటు ఆశించారు. 

దీంతో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం కాగా, అభ్యర్థి ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరకు సత్యంకే చాన్స్ ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. కాగా, పొత్తు ధర్మం పాటించి, ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించినందుకు కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్​కు సీపీఐ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్​తో కలిసి మరింత ఐక్యతతో పని చేస్తామన్నారు.