సీతారాం ఏచూరి పరిస్థితి విషమం

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌‌ ప్రైవేట్ వార్డులోని ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. న్యుమోనియా, లంగ్ ఇన్‌‌ఫెక్షన్‌‌తో బాధపడుతున్న సీతారాం ఏచూరి.. ఆగస్టు 19న ఎయిమ్స్‌‌లో చేరారు.

సీనియర్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్మెంట్ అందుతున్నది. ప్రస్తుతం సీతారాం ఏచూరికి వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నామని..ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా..ఏచూరికి ఇటీవల కంటిశుక్లం ఆపరేషన్ కూడా జరిగింది.