స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

పెద్దపల్లి, వెలుగు: ప్రజా సమస్యలపై సీపీఐ  రాజీలేని పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్‌‌‌‌రెడ్డి అన్నారు. గురువారం  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి మోసం చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటేనని విమర్శించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  సీపీఐని బలోపేతం చేసి తమ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో  సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్​, లీడర్లు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, కడారి సునీల్, కె.కనకరాజ్, మల్లయ్య, స్వామి, ఓదెమ్మ పాల్గొన్నారు.