ఎర్ర జెండాలు లేకుండా చేస్తామనడం సరికాదు :చాడ వెంకట రెడ్డి

ఎర్ర జెండాలు లేకుండా చేస్తామనడం సరికాదు :చాడ వెంకట రెడ్డి
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: దేశంలో 2026 నాటికి ఎర్ర జెండాలను నామరూపాలు లేకుండా చేస్తామనడం బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తగదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో అనభేరి సింగిరెడ్డి అమరుల 77వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం అయన మాట్లడుతూ తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా నేడు ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ఉద్యమ కారులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలోనైనా న్యాయం చేయలన్నారు.

హైదరాబాద్ లో అమరవీరుల స్మృతి వనం విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు, ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్​, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జాగీర్ సత్య నారాయణ, వనేశ్, లక్ష్మణ్, అశోక్, లక్ష్మారెడ్డి, లక్ష్మి, రాజయ్య, స్వామి పాల్గొన్నారు.