ఇండియా కూటమిదే నైతిక విజయం : నారాయణ

ఇండియా కూటమిదే నైతిక విజయం : నారాయణ

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఎన్​డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆ సర్కారు ఇష్టానుసారంగా వ్యవహరించకుండా  అడ్డుకునేందుకు కావాల్సినన్ని సీట్లు కాంగ్రెస్​కు వచ్చాయన్నారు. టీడీపీ చీఫ్​ చంద్రబాబు ఎన్ డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కోరారు. సీపీఐ స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే సానుభూతి కలిసి వచ్చి గెలిచారన్నారు.