లగచర్లలోని పరిస్థితిని సీఎంకు నివేదిస్తం: తమ్మినేని వీరభద్రం

లగచర్లలోని  పరిస్థితిని సీఎంకు నివేదిస్తం: తమ్మినేని వీరభద్రం
  • ప్రజాస్వామ్య బద్దంగా భూ సేకరణ జరగడం లేదు 
  • దీనిపై అఖలపక్ష సమావేశం పెట్టండి 

హైదరాబాద్:  ఫార్మాసిటీకి సంబంధించి లగచర్లలో భూ సేకరణ ప్రజాస్వామ్య బద్దంగా జరగడం లేదని,  దీనిపై అఖలపక్ష సమావేశం పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు..  ప్రభుత్వం ఏకపక్షంగా భూ సేకరణ చేయాలని చూస్తోందన్నారు. ‘ ఎన్నికల సమయంలో ఫార్మా సిటీ రద్దు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు.  జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి తర్వాత లగచర్ల జైలు లాగా అయిపోయిందని అన్నారు.

ALSO READ | ప్రభుత్వ ఆస్తుల్ని హైడ్రా రక్షిస్తుంది: హైడ్రా కమిషనర్​​ రంగనాథ్​

ప్రతి పక్షాలను సంఘటన ప్రదేశానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వడం  లేదు. ఏకపక్ష నిర్ణయాలతో గత  ప్రభుత్వాలు చాలా నష్ట పోయాయి.  ఈ నెల 21 న లగచర్ల ప్రాంతానికి వెళ్తాం.  తర్వాత  అక్కడి పరిస్థితిపై  సీఎం కి నివేదిక ఇస్తాం. ఫోర్త్ సిటీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఎకరాలను సేకరిస్తామని చెబుతుంది.  హైడ్రా , మూసీ , గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది. ’ అని తమ్మినేని అన్నారు.