వక్ఫ్ సవరణ చట్టం ఎవరి కోసం : చాడ వెంకటరెడ్డి

వక్ఫ్ సవరణ చట్టం ఎవరి కోసం : చాడ వెంకటరెడ్డి

పంజాగుట్ట, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం ఎవరి కోసమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈ చట్టాన్ని కులమతాలకు అతీతంగా తిప్పి కొట్టాలని పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు పిలుపు నిచ్చారు. రైతు ఉద్యమం తరహాలో మరో పోరాటానికి నాంది పలకాలన్నారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ‘వక్ఫ్​సవరణ చట్టం ఎవరి కోసం’ అనే అంశంపై రౌండ్​టేబుల్ సమావేశం నిర్వహించారు. 

సీపీఐ నేత కమతం యాదగిరి అధ్యక్షత వహించారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్​బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారని తెలిపారు.  ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే.. మరో వైపు ప్రజా ఉద్యమంతో కేంద్ర వైఖరిని ఎండగడతామన్నారు. వి.ఎస్.బోస్, నర్సింహ, మోటూరి కృష్ణప్రసాద్, ఎంబీటీ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ఖాన్ తదితరులు పాల్గొని మాట్లాడారు.