బోగస్ బోనస్​పై విజిలెన్స్​ విచారణ చేయాలి : దుబాస్ రాములు

బోగస్ బోనస్​పై విజిలెన్స్​ విచారణ చేయాలి : దుబాస్ రాములు
  • సొసైటీ ఎదుట  రైతులు, సీపీఐ శ్రేణుల ధర్నా 

కోటగిరి, వెలుగు : కోటగిరి సొసైటీ కేంద్రంగా జరిగిన బోగస్ బోనస్​పై విజిలెన్స్​ విచారణ చేయించాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి దుబాస్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బుధవారం సొసైటీ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.  బోగస్​ బోనస్​తో రూ.50 లక్షల వరకు అవినీతి జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. వానకాలం సీజన్​లో వర్షానికి పంట నష్టపోయిన రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోగా, కొనుగోలు కేంద్రాల్లో అమ్మినట్లు రికార్డులు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు. 

 కోటగిరి మండల కేంద్రంలోని ఎస్‌ఏ ట్రేడర్స్,జీఎంకే ట్రేడర్స్ ,శ్రీ సాయి ఆగ్రో ఇండస్ట్రీస్,ఎక్లాస్ పూర్ లోని ఓం సాయి రైస్ మిల్ కేంద్రంగా బోనస్ బాగోతం నడిచినట్లు ఆరోపించారు. బోనస్ డబ్బులు కాజేసిన రైస్‌మిల్లర్లపై విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, నాయకులు నల్ల గంగాధర్, బుడాల రాములు, కాంగ్రెస్​ కోటగిరి గ్రామ అధ్యక్షుడు ఆనంద్, మాజీ ఎంపీటీసీ సలీం, కూచి సాయిబాబు, నజీర్, చోటోమియా, దాదు, నల్ల నరసయ్య, బూడాల శివరాజు, హనుమాన్లు, సో హెల్, వాజిద్, పాకాల సాయిలు, ఆకుల లక్ష్మణ్, ఎర్ర సాయిలు పాల్గొన్నారు.