- సీపీఐ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, కూనంనేని
హైదరాబాద్, వెలుగు: లగచర్లలో ఫార్మా సిటీ ప్రతిపాదనను రద్దు చేయడాన్ని సీపీఐ జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, కూనంనేని సాంబశివరావు స్వాగతించారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫార్మా సిటీకి బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందని, రైతుల నుంచి తక్కువ భూములు సేకరించడంతో పాటు సహాయ, పునరావాస ప్యాకేజీలో భూమికి భూమి ఇవ్వాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సామాజిక సర్వే చేయాలని, పరిహారం, ఉపాధి కల్పించాలని కోరారు. కాలుష్యరహిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు.