సంగబత్తుల వెంకటరెడ్డికి సీపీఐ లీడర్ల నివాళి

కూసుమంచి,వెలుగు : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు గైగోళ్లపల్లి మాజీ సర్పంచ్, సీపీఐ సీనియర్​ నేత సంగబత్తుల వెంకటరెడ్డి (98)ఆదివారం అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం     అంతియాత్ర ముగిసింది.  వెంకటరెడ్డికి  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించారు.  ఆయనతో పాటు   సీపీఐ నాయకులు భాగం హేమంత్​రావు,జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్​,మహ్మమద్​ మౌలానా,దండి సురేశ్​ కర్ణ కుమార్,  వెంకటేశ్వరరావు,  రామాంజనేయులు తదితరులు ఉన్నారు.