వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి : సీపీఐ నాయకులు

వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి : సీపీఐ నాయకులు

బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్​తోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని  బెల్లంపల్లిలో సీపీఐ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి టౌన్ సెక్రటరీ ఆడెపు రాజమౌళి నాయకత్వంలో బుధవారం సీపీఐ కార్యకర్తలు బజార్ ఏరియాలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై రూ.50, పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2 పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మాత్రమే మద్దతుగా నిలుస్తోందని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి రూ.వేల కోట్లను కార్పొరేట్ సంస్థలకు ముట్టజెబుతోందని మండిపడ్డారు. పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు బొల్లం పూర్ణిమ, గుండా సరోజన, గుండా చంద్రమాణిక్యం, కొంకుల రాజేశ్, రత్నం రాజం తదితరులు పాల్గొన్నారు.