
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్ పై నమోదైన ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. న్యాయ విచారణ చేపట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజయన్కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి అక్రమ రీతిలో డబ్బులు బదిలీ అయినట్లు ఆరోపణలున్నాయి.
సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు దాఖలు చేసిన ఛార్జ్ట్ ఆధారంగా కేసు విచారణకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కొ చ్చిలోని ఆర్థిక నేరాలను పరిశీలించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు ఫైల్ అయ్యింది. సీఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ మధ్య అక్రమ రీతిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమా నించారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి వీణా విజయనకు చెందిన కంపెనీకి సుమారు 1.72 కోట్లు బదిలీ అయ్యాయి.
Also Read:-అసలు ‘కైలాస’ దేశమే లేదు.. అన్నీ సొల్లు ముచ్చట్లే.. వెలుగులోకి ‘నిత్యానంద’ బాగోతం
దీంతో ఈకేసులో విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఎఓ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఎఫ్ఎఓ తన చార్జ్ షీట్ లో వీణా విజయన్ తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 మంది నిందితుల పేర్లను చేర్చింది. ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.