హైదరాబాద్ : ధరణి పోర్టల్ గ్రామీణ భూస్వామ్య వ్యవస్థకు వరంగా మారిందని, ఆ పోర్టల్ రద్దు కోసం పోరాడాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇవాల ఒక ప్రకటన విడుదల చేసింది. దున్నే వాడికే భూమి కావాలని, భూమి, భుక్తి , విముక్తి పోరాటాల మార్గంలో తెలంగాణ ప్రాంతంలో వేలాది ఎకరాలను ప్రజలు దక్కించుకున్నారని పేర్కొన్నది. తెలంగాణలో దొరలగడీలు కొత్త రంగులు దిద్దుకునేలా ధరణి పోర్టల్ సహకరిస్తోందని పేర్కొన్నది. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమాన్ని నిర్మించాల్సిన రాజకీయ కర్తవ్యం యువతపై ఉందని తెలిపింది.
బీజేపీ నుంచి దేశాన్ని ప్రజలను కాపాడాలని, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ప్రతిఘటించాలని యువకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకగా పోరాడాలని కోరింది. సిరిసిల్ల, జగిత్యాల జైత్రయాత్ర లాంటి వాస్తవిక పునాదుల మీద నిర్మించబడిన ప్రజా ఉద్యమాల చరిత్రను అమరుల త్యాగాలను అధ్యయనం చేయాలని యువతను మావోయిస్టు పార్టీ కోరింది.