మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలి: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్

మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలి: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఛత్తీస్​గఢ్​అడవుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలను ప్రారంభించాలని కోరింది. ఈ మేరకు మంగళవారం ఇందిరాపార్క్​ధర్నా చౌక్ లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ప్రొఫెసర్ రమా మేల్కోటే పాల్గొని మాట్లాడారు. 

బస్తర్ ప్రాంతంలో నరమేధం కొనసాగుతోందన్నారు. ఇది ఆదివాసి జాతి అంతానికే తప్ప.. సంక్షేమానికి ఏమాత్రం కాదన్నారు. దేశానికి ఆదివాసులే మొదటి హీరోలు అని చెప్పారు. సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నేత జేవీ చలపతిరావు, సాధినేని వెంకటేశ్వరరావు, పశ్యపద్మ, జూలకంటి రంగారెడ్డి, రమా, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు