మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యుడు రాయల చంద్రశేఖర్ ఆత్మహత్య

మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యుడు రాయల చంద్రశేఖర్ ఆత్మహత్య
  •     రైలు కింద పడి సూసైడ్​ 
  •     ఆర్థిక సమస్యలే కారణమన్న  కుటుంబసభ్యులు 
  •     పార్టీలో విభేదాల వల్లే ​అంటున్న మరికొందరు..

ఖమ్మం టౌన్, వెలుగు : సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) కేంద్ర కంట్రోల్ కమిషన్​చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మంగళవారం అర్ధరాత్రి దానవాయిగూడెం రైల్వే ట్రాక్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైన్ లోకో పైలట్​ఖమ్మం జిఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టకుండా ఉండడంతో అన్​నోన్​డెడ్​బాడీగా ధ్రువీకరించి అన్నం సేవా ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు సహకారంతో జిల్లా ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు.

బుధవారం ఉదయం రాయల కుటుంబసభ్యులు పీఎస్​లో చంద్రశేఖర్​లో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అన్​నోన్​డెడ్​బాడీ దొరికిందని మార్చురీ వద్దకు పంపించి చూపించగా అనవాళ్లను బట్టి ఆయనను రాయల చంద్రశేఖర్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలు దిగ్భ్రాంతి చెందాయి. భౌతికాయన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్థం మాస్ లైన్ పార్టీ ఆఫీసులో ఉంచగా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.

తర్వాత ఆయన స్వగ్రామమైన పిండిప్రోలులో అంత్యయక్రియలు నిర్వహించారు.  చంద్రశేఖర్​కు భార్య విమలక్క, కొడుకు పావెల్ ఉన్నారు. ఆర్థిక సమస్యలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు చెప్తుండగా, మరికొందరు పార్టీలో నెలకొన్న విబేధాలే కారణమన్న చర్చ నడుస్తోంది.