విప్లవకారులందరూ ఏకం కావాలి : దర్శన్ సింగ్ కట్కర్

విప్లవకారులందరూ ఏకం కావాలి : దర్శన్ సింగ్ కట్కర్
  • సీపీఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ విలీన సభలో దర్శన్ సింగ్ కట్కర్

ముషీరాబాద్, వెలుగు : దేశానికి ఫాసిస్ట్​ప్రమాదం పొంచి ఉన్నప్పుడు విప్లవకారులందరూ ఏకం కావాలని సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ కట్కర్ కోరారు. శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ జరిగింది. ముఖ్య అతిథిగా దర్శన్ సింగ్ కట్కర్ పాల్గొని మాట్లాడారు. రెండు పార్టీల ఐక్యత కోసం పదేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

దేశ ప్రజల మధ్య ఉన్న సోదర భావాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ నేత వేములపల్లి వెంకట రామయ్య, సాధినేని వెంకటేశ్వరరావు, ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు.