దళిత కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలి: కూనంనేని

దళిత కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలి: కూనంనేని

వర్గీకరణ అనేది పెద్ద ముందడుగన్నారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరు ఈ బిల్లుకు మద్దతివ్వాల్సిందేనన్నారు. వర్గీకరణ అమలయ్యేలా కేంద్రంలో చట్టం తేవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత తేవడం సంతోషమన్నారు కూనంనేని. రెల్లి సామాజిక వర్గాన్ని గ్రూప్ 3లో కలిపారు. రెల్లి సమాజిక వర్గాన్ని గ్రూప్ 3లో పెట్టడం కరెక్ట్ కాదన్నారు.  2026 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ ఉండాలన్నారు.

ALSO READ | బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

 కొన్ని కులాలలు ప్రాతనిథ్యం లేవని చెబుతున్నాయి. అసంతృప్తితో ఉన్న కులాలతో ప్రభుత్వం మాట్లాడాలన్నారు కూనంనేని . కులం అనేది ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు . వర్గీకరణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు. దళిత కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలన్నారు. కులానికి తెలివితేటలకు సంబంధం లేదన్నారు. ఎస్సీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నామన్నారు కూనంనేని సాంబశివరావు.