అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ మోదీ, యోగీ ఈవెంట్ లా సాగింది : నారాయణ

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ మోదీ, యోగీ ఈవెంట్ లా సాగింది : నారాయణ
  • రాష్ట్రపతిని ఎందుకు పిలవలే?

  • ఆమె ముత్తైదువ కాదనా..?

  • ఎన్నికల్లో లబ్ధి కోసమే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ 

  •  మోదీ, యోగీ ఈవెంట్ లా సాగింది

  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్: రామ మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి మోదీని ఆహ్వానించకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పు పట్టారు. ఆమెను ఎందుకు పిలవలేదు,ముత్తైదువ కాదనా? అని ప్రశ్నించారు. ఇవాళ ( జనవరి 25) ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఒక మతానికి చెందిన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. రామ మందిర నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్న నారాయణ.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం మోదీ, యోగి ఈవెంట్ లా సాగిందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని విమర్శించారు.

 రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన జడ్జిలలో ఒకరికి రాజ్యసభ, మరొకరికి గవర్నర్ పదవులు కట్టబెట్టారని నారాయణ ఆరోపించారు.  ఇండియా కూటమి బలోపేతం కోసం విశాల దృక్పథంతో కాంగ్రెస్ వ్యవహరించాలన్నారు. మోదీ బ్లాక్ మెయిల్ కి భయపడి కొందరు ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ... బీజేపీని కౌగిలించుకోవడం తోనే ఓడిపోయారని చెప్పారు. ఏపీలో జగన్ పాలన చివరి దశకు చేరిందన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు బీజేపీకి తానా అంటే తందానా అని  పాడేవాళ్లేనని అన్నారు.