ముందస్తుకు పోతే బీజేపీ ఇంటికే : సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఇంటికే పోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారా యణ అన్నారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్‌‌’కు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. సమస్యలపై దేశం దృష్టి మరల్చే రాజకీయాలు చేయ డంలో మోదీ ఘనుడని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలతో ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’అని లీక్ ఇచ్చారన్నారు. వన్ నేషన్, వన్ పార్టీ, వన్ పర్సన్.. ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా కేంద్ర వైఖరి ఉందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సరికాదన్నారు.

ALSO READ : మాజీ సర్పంచ్ హత్య కేసులో .. ఆరుగురికి జీవితఖైదు