- టికెట్ల రేట్లు పెంచడం బ్లాక్మార్కెట్లను ప్రోత్సహించడమే
- సామాన్య ప్రజల కోసం ఆలోచన చేయండి
సంధ్య థియేటర్తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా వారి ప్రాణాలు తిరిగి తెచ్చి ఇవ్వలేరని సీసీఐ నాయకులు నారాయణ అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సినిమాతో అమాయక మహిళ ప్రాణాలు కోల్పొవడం బాధాకారం ‘ ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారు. రూ. వేల కోట్ల లాభాలు వచ్చే సినిమాలకు ప్రభుత్వాలు టికెట్రేట్ల పెంచేందుకు పర్మిషన్లు ఇవ్వడం ఎందుకు? పుష్ప 2 సినిమాలో అసలు ఏముంది?.. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.
ALSO READ | సినిమా వాళ్లను సీఎం రేవంత్ భయపెట్టొద్దు : హరీశ్ రావు
అలాగే ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు. రష్మిక ఆవేదనను సానుకూలంగా అర్ధం చేసుకోవాలి. ఇలా ఎంతోమంది మహిళలు ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారు. ప్రభుత్వాలు సందేశాత్మక చిత్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. టికెట్ల ధరలను పెంచడం బ్లాక్ మార్కెట్లకు ప్రోత్సాహం ఇవ్వడమే అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు సామాన్య ప్రజలకు భారం పడకుండా ఉండాలి’ అని నారాయణ అన్నారు.